తమిళ తెలుగు బాషలలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేస్తున్న సమంత తను తాజాగా నటించిన 24 చిత్రం ప్రమోషన్ లో పాల్గొంది. ఈ సందర్బంగా ఓ మీడియా ప్రతినిది మీరు తమన్నా లాగా ఐటెం సాంగ్స్ చేస్తారా? అని అడగ్గా సమంత "ఐటెం సాంగ్స్ చేయాలంటే మంచి డ్యాన్సర్ అయి ఉండాలి. కాని నేను ఇప్పటి దాక ఏ పాటల్లోనూ డాన్స్ సరిగా చేయలేదు. కొన్ని కొన్ని సార్లు అసలు డాన్స్ చేయకుండా అలా ఊరికే నడిచి వస్తూ ఉంటా. కాబట్టి నేను ఐటెం సాంగ్స్ కి పనికి రాను. ఏదైనా కాన్సెప్ట్ బేస్డ్ సాంగ్స్ ఐతే ఓకే" అని చెప్పుకొచ్చింది సమంత. అలాగే అనుష్క త్రిష , నయనతార ల తరహాలో లేడి ఓరియంటెడ్ చిత్రాలు చేస్తారా? అని అడగ్గా "సినిమా హీరో ఓరియంటెడా లేక హీరోయిన్ ఓరియంటెడా అని నేను ఆలోచించను. కంటెంట్ బాగుంది నాకు నచ్చితే ఏ సినిమాలు అయిన చేస్తాను. అయితే పర్టిక్యులర్ గా లేడి ఓరియంటెడ్ సినిమాలు చేయాలనీ లేదు కాని పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలనీ ఉంది. ప్రస్తుతానికి కన్నడ లో హిట్ అయిన యు టర్న్ సినిమా ఆసక్తి గా ఉన్నాను. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ బాషలలో రీమేక్ చేయాలనుకుంటున్నట్లు సమంత తెలిపింది
No comments:
Post a Comment