బ్రహ్మోత్సవంతో కొత్త టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్న మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంతో ఓవర్సీస్ లో మహేష్ కొత్త టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పటికే టిజర్, ట్రైలర్ ,ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి సంబందించిన ఓవర్సీస్ రైట్స్ ను దాదాపు 13 కోట్ల రూపాయలకు నిర్మాతలు అమ్మినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ బయ్యర్ లాభాల బాట పట్టాలన్న బ్రహ్మోత్సవం సూపర్ హిట్ అవ్వాలన్న కనీసం 2.5 నుండి 3 మిలియన్ డాలర్ల మధ్య వసూళ్ళని రాబట్టల్సిందే. అయితే ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ల ట్రెండ్ ని మహేష్ దూకుడు చిత్రంతో సెట్ చేశాడు. అక్కడి నుండి రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. ఆగడు, వన్ నేనొక్కడినే వంటి ప్లాప్ చిత్రాలతో కూడా మహేష్ మిలియన్ డాలర్లని ఓవర్సీస్ లో కొల్లగొట్టి రికార్డ్ సృష్టించాడు. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ శ్రీమంతుడు చిత్రంతో 2.5 పైగా వసూల్ చేసి అదరగోట్టిన మహేష్ కు పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన క్లాస్ చిత్రం బ్రహ్మోత్సవంతో ఓవర్సీస్ లో దుమ్ములేపడం ఖాయంగానే కనిపిస్తోంది. చూద్దాం మరి మహేష్ కొత్త టార్గెట్ ని రీచ్ అవుతాడో లేదో.
No comments:
Post a Comment