భారత్‌లో Samsung Pay, ఎలా వాడాలిhttp://m.dailyhunt.in/news/india/telugu/gizbot+telugu-epaper-telgiz/bhaaratlo+samsung+pay+ela+vaadaali-newsid-65414388
సామ్సంగ్ మొబైల్ పేమెంట్స్ సర్వీస్ Samsung Pay, ఈ రోజు అధికారికంగా లాంచ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్కు సంబంధించి ఎర్లీ యాక్సిస్ రిజిస్ట్రేషన్స్ సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్
(NFC), మాగ్నటిక్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ (MST) వంటి అత్యాధునిక పేమెంట్ టెక్నాలజీలను సామ్సంగ్ పే యాప్ సపోర్ట్ చేస్తుంది.
Read More :
సామ్సంగ్ గెలాక్సీ నోట్ 5, సామ్సంగ్ గెలాక్సీ ఎస్7, సామ్సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, సామ్సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్+, సామ్సంగ్ గెలాక్సీ ఏ7 (2016),సామ్సంగ్ గెలాక్సీ ఏ5 (2016). త్వరలోనే మరిన్ని సామ్సంగ్ స్మార్ట్ఫోన్లకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు
యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులను సంబంధించిన కార్డులను సామ్సంగ్ పే సపోర్ట్ చేస్తుంది. తర్వలోనే మరిన్ని బ్యాంకులతో సామ్సంగ్ పే ఒప్పందం కుదుర్చుకోబోతోంది. Paytm వాలెట్ ద్వారా కూడా సామ్సంగ్ పే చెల్లింపులను చేపట్టవచ్చు.
సామ్సంగ్ పే సౌకర్యాన్ని POS మెచీన్, కార్డ్ రీడర్ అలానే, ఎన్ఎఫ్సీ రీడర్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. సామ్సంగ్ పే ద్వారా చెల్లించే క్రమంలో యూజర్లు ముందుగా తమ ఫోన్లోని సామ్‌సంగ్ పే యాప్ను ఓపెన్ చేయవల్సి ఉంటుంది.
ఆ తరువాత కార్డును సెలక్ట్ చేసుకుని ఫింగర్ ప్రింట్ లేదా పిన్ ద్వారా authenticate చేయవల్సి ఉంటుంది. ఆ తరువాత వర్తకుని వద్ద నగదు స్వీకరణ కోసం అందుబాటులో ఉంచిన పేమెంట్ టెర్మినల్కు సమీపంగా తన ఫోన్ను ఉంచాల్సి ఉంటుంది. ఇలా చేసిన వెంటనే చెల్లింపులు జరిగిపోతాయి.
No comments:
Post a Comment