Wednesday, 22 March 2017

10 రూపాయల ప్లాస్టిక్ నోట్స్ రెడీ..

10 రూపాయల ప్లాస్టిక్ నోట్స్ రెడీ..

పెద్దనోట్ల రద్దుతో హడలిపోయిన సామాన్యుడు, కొత్త కరెన్సీ గురించి వార్త వచ్చిన ప్రతిసారీ బెంబేలెత్తిపోతున్నాడు. తాజాగా
ప్లాస్టిక్ కరెన్సీపై పార్లమెంటులో నోరెత్తింది కేంద్రం. త్వరలో పది రూపాయల ప్లాస్టిక్ నోటును చలామణిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై ట్రయల్ నిర్వహించాలని ఆర్బీఐని ఆదేశించినట్లు లోక్‌సభలో కేంద్రమంత్రి అర్జున్ రామ్‌మేఘ్వాల్ తెలిపారు. దేశంలో ఐదు చోట్ల ప్లాస్టిక్ నోట్లతో ట్రయల్ నిర్వహించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. కాటన్ నోట్ల కన్నా, ప్లాస్టిక్ నోట్లు ఎక్కువకాలం మన్నిక వుంటుందని, వీటిని చలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి సభలో తెలిపారు.
ప్లాస్టిక్ కరెన్సీని ప్రారంభించాలని ఆర్బీఐ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఎంపిక చేసిన ఐదు సిటీలు కొచ్చి,
మైసూరు, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్‌ల్లో రూ.100 కోట్ల విలువైన 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లను ప్రవేశ పెట్టాలని 2014
ఫిబ్రవరిలో పార్లమెంటుకు తెలిపింది ప్రభుత్వం. ఈలోగా ప్రభుత్వాలు మారిపోవడంతో వెనక్కి వెళ్లింది. వీటితో నకిలీ నోట్లను తయారు చేయడం చాలా కష్టమైనది కూడా. ఫేక్ నోట్ల బెడదను తప్పించుకునేందుకు ఫస్ట్‌టైమ్ ఆస్ట్రేలియా ఈ తరహా నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెల్సిందే!
Source:dailyhunt.in

No comments:

Post a Comment

India's most powerful rail engine

Modi to flag off India's most powerful rail engine: All about the locomotive With the new locomotive, India will join th...